నేటి నుంచి పొగాకు ఉత్పత్తులపై భారీ పన్నులు పెరగనున్న గుట్కా మరియు సిగరెట్ ధరలు
February 1, 2026

నేటి ఫిబ్రవరి 1వ తేదీ నుండి పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తులపై కఠినమైన నియంత్రణలు మరియు పెంచిన పన్నులు అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలా తయారీదారులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ప్యాకేజింగ్ యంత్రాలపై సిసిటివి కెమెరాలను అమర్చడం ఇప్పుడు తప్పనిసరి. పారదర్శకత కోసం ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు ఆదేశించారు.
మరోవైపు సిగరెట్ల పొడవును బట్టి ఒక్కో స్టిక్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచారు. పొగాకు, గుట్కా మరియు జర్దాలపై కూడా అధిక పన్నులు విధించడంతో వీటి ధరలు సామాన్యులకు భారం కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.