దేవుడి విశ్రాంతికి ఆటంకం కల్పిస్తున్నారా? శ్రీ బాంకే బిహారీ ఆలయ దర్శన వేళలపై CJI సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు

దేవుడి విశ్రాంతికి ఆటంకం కల్పిస్తున్నారా? శ్రీ బాంకే బిహారీ ఆలయ దర్శన వేళలపై CJI సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు

బృందావన్‌లోని శ్రీ బాంకే బిహారీ ఆలయంలోని వీఐపీ దర్శనం, పూజలపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణ భక్తులకు దర్శనం లేని సమయంలో, అధిక రుసుము చెల్లించే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, ఇది “దేవుడికి ఒక్క నిమిషం కూడా విశ్రాంతినివ్వడం లేదని” ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.

సాధారణ భక్తుల కోసం దర్శన సమయాన్ని పొడిగించాలని కోరిన హై పవర్డ్ కమిటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఆలయ సేవాయత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విషయంలో హై పవర్డ్ కమిటీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది; తదుపరి విచారణ జనవరిలో జరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *