ఒక రోజులో 4 గంటలు టాయిలెట్ బ్రేక్! సీసీటీవీ ఫుటేజ్ చూసి కంపెనీ షాకింగ్ నిర్ణయం

పని సమయంలో తరచుగా మరియు ఎక్కువసేపు టాయిలెట్ బ్రేకులు తీసుకున్నందుకు తూర్పు చైనాకు చెందిన ఒక ఇంజనీర్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన ‘లీ’ అనే ఇంజనీర్ ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 14 సార్లు టాయిలెట్‌కు వెళ్లారు, ఒక రోజు గరిష్టంగా నాలుగు గంటలు బ్రేక్ తీసుకున్నారు. దీనిని పనివేళల్లో విధులు నిర్వహించకపోవడం (absence from post) యొక్క ఉల్లంఘనగా భావించి కంపెనీ అతన్ని తొలగించింది.
పైల్స్ సమస్య కారణంగా తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంటూ, లీ అక్రమ తొలగింపుపై కోర్టులో కేసు వేశారు, 3,20,000 యువాన్ పరిహారం డిమాండ్ చేశారు. అయితే, కంపెనీ సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించింది. సాధారణ శారీరక అవసరాలకు మించి ఎక్కువ సమయం టాయిలెట్‌లో గడపడం వల్ల కంపెనీ పనికి అంతరాయం కలిగిందని కోర్టు అంగీకరించింది. ఇరు పక్షాల మధ్య కోర్టు మధ్యవర్తిత్వం వహించి, లీకి 30,000 యువాన్ భత్యాన్ని చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.