థాయ్‌లాండ్, సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేసి 100 కోట్లు వసూలు, మహిళ అరెస్ట్

థాయ్‌లాండ్, సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేసి 100 కోట్లు వసూలు, మహిళ అరెస్ట్

థాయ్‌లాండ్‌లో పలువురు బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని, వారిని బ్లాక్‌మెయిల్ చేసి దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలతో ఒక మహిళను అరెస్టు చేశారు. విలవాన్ అమ్సావాద్ అనే ఈ మహిళ బ్యాంకాక్‌లో పట్టుబడింది. సీనియర్ సన్యాసులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, వారితో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి కనీసం తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులను వారి పదవుల నుండి తొలగించారు. గత మూడు సంవత్సరాలలో విలవాన్ బ్యాంక్ ఖాతాలకు సుమారు $1.19 మిలియన్ డాలర్లు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది, ఇందులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ జూదానికి ఖర్చయింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *