జపాన్ కాదు ప్రపంచంలోనే మొదటి సూర్యోదయం ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు
December 28, 2025

జపాన్ను ‘సూర్యుడు ఉదయించే దేశం’ అని పిలుస్తారు, కానీ వాస్తవానికి పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లోనే ప్రపంచంలో మొదటి సూర్యోదయం జరుగుతుంది. అంతర్జాతీయ దినరేఖ మార్పుల కారణంగా కిరిబాటిలోని మిలీనియం ద్వీపం ప్రతిరోజూ మొదటి సూర్యకిరణాలను అందుకుంటుంది. చైనాకు తూర్పున ఉండటం వల్ల జపాన్‌కు ఆ పేరు వచ్చింది కానీ భౌగోళికంగా కిరిబాటి అగ్రస్థానంలో ఉంది.
సుమారు 33 పగడపు దీవుల సముదాయమైన కిరిబాటి ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల ముప్పును ఎదుర్కొంటోంది. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో కేవలం రెండు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అందమైన ద్వీప దేశం భవిష్యత్తులో మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.