చైనా రాకెట్ లాంచర్ పేలి ఎనిమిది మంది సైనికుల మృతి డ్రాగన్ దేశం నాసిరకం ఆయుధాలపై విమర్శలు

చైనా రాకెట్ లాంచర్ పేలి ఎనిమిది మంది సైనికుల మృతి డ్రాగన్ దేశం నాసిరకం ఆయుధాలపై విమర్శలు

థాయ్‌లాండ్‌తో సరిహద్దు ఉద్రిక్తతల వేళ చైనా ఆయుధాలను నమ్ముకున్న కంబోడియాకు భారీ షాక్ తగిలింది. చైనా తయారీ ఎం270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ ద్వారా ప్రయోగాలు చేస్తున్న సమయంలో, ఒక రాకెట్ లాంచర్‌లోనే చిక్కుకుపోయి భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కంబోడియా సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భారత్ కు చెందిన పినాకాతో సమానమని చైనా గొప్పలు చెప్పుకునే ఈ వ్యవస్థ విఫలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో పాకిస్థాన్ ప్రయోగించిన చైనా మిసైళ్లు, డ్రోన్లు లక్ష్యాన్ని చేరకుండానే కుప్పకూలిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కంబోడియాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం చైనా ఆయుధాల నాణ్యతను మరోసారి ఎండగట్టింది. చైనా నుండి దిగుమతి చేసుకున్న చౌకబారు యుద్ధ సామాగ్రి వల్ల సొంత సైనికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైనా తయారీ వస్తువులపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *