గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి మీ బిడ్డ మెదడుపై చూపే తీవ్ర ప్రభావం

గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి మీ బిడ్డ మెదడుపై చూపే తీవ్ర ప్రభావం

గర్భధారణ సమయంలో తల్లి మానసిక స్థితి అప్పుడే పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలపై కీలక ప్రభావం చూపుతుంది. లాన్సెట్ జర్నల్ పరిశోధన ప్రకారం, గర్భవతులు డిప్రెషన్‌కు లోనైతే పిల్లల్లో ఏడీహెచ్‌డీ (ADHD), ఆటిజం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరిగి, అది బిడ్డ ఏకాగ్రత మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ కలహాలు, నిద్రలేమి వంటివి ఈ మానసిక సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి గర్భిణీలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం అవసరం. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా ఆందోళన చెందడం లేదా ఎప్పుడూ దిగులుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం తల్లికి కుటుంబ సభ్యుల మద్దతు మరియు ప్రశాంతమైన వాతావరణం ఎంతో కీలకం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *