కాశ్మీర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జైషే మహమ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల హతం
February 23, 2026

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో 20 సార్లు తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైఫుల్లా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఆపరేషన్‌లో టైసన్ అనే ఆర్మీ డాగ్ గాయపడగా ఘటనా స్థలం నుండి రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేసింది.