కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ధర్మాసనం

కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ధర్మాసనం

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు ఎంసీడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టోల్ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ప్రాముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొంటూ, వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుండి జనవరి 31 వరకు టోల్ వసూలు నిలిపివేయాలని సూచించింది.

ఒక వారంలోగా దీనిపై స్పష్టమైన ప్రణాళికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి కేవలం ఆదాయం కోసం టోల్ ప్లాజాలను కొనసాగించలేమని, దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ తో సమన్వయం చేసుకోవాలని కోర్టు సూచించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *