ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ నిరసన మోదీ తీవ్ర ఆగ్రహం

ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ నిరసన మోదీ తీవ్ర ఆగ్రహం

భారత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికను కాంగ్రెస్ తన మురికి రాజకీయాలకు వాడుకుంటోందని మీరట్ సభలో విమర్శించారు. ఈ చర్య వారి సైద్ధాంతిక పతనాన్ని సూచిస్తోందని ప్రధాని ధ్వజమెత్తారు.

దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ దేశ ప్రయోజనాల కోసం ప్రశ్నించడం తమ హక్కు అని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నిరసన విషయంలో డిఎంకె వంటి ఇతర విపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేదని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *