ఇరాన్‌పై ఎప్పుడైనా అమెరికా దాడి చేసే అవకాశం
February 23, 2026

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అణు ఒప్పందానికి ఇరాన్ నిరాకరించడంతో, అమెరికా తన అమ్ములపొదిలోని ఎఫ్-22 రాప్టర్స్, ఎఫ్-35సి మరియు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారీగా మోహరించింది. దీని కోసం అగ్రరాజ్యం ఒక భారీ ‘ఎయిర్ బ్రిడ్జ్’ను ఏర్పాటు చేసి నిరంతరం ఆయుధాలను తరలిస్తోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ యుద్ధనౌకలు ఇప్పటికే ఇరాన్ సరిహద్దులకు చేరుకోవడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ట్రంప్ విధించిన 10 రోజుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ వారంలోనే ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధ విమానాల కదలికలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.