ఆరావళి పర్వతాల రక్షణకు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
December 28, 2025

ఆరావళి పర్వతశ్రేణుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో స్వచ్ఛందంగా జోక్యం చేసుకున్న అత్యున్నత నాయస్థానం, తిరిగి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మరియు విచారణ తేదీని శనివారం సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోర్టు ఈ దిశగా అడుగులు వేస్తోంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ డిసెంబర్ 29 సోమవారం ఈ కేసును విచారించనుంది. ఈ బెంచ్‌లో జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ సభ్యులుగా ఉన్నారు. ఆరావళి ప్రాంత పరిరక్షణపై కోర్టు తీసుకోబోయే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.