ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ధ్వంసమైందని అంగీకారం

ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ ధ్వంసమైందని అంగీకారం

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడిలో తమ సైనిక స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ జరిపిన దాడిలో సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకుండా, సిబ్బంది కూడా గాయపడ్డారని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. 36 గంటల వ్యవధిలో భారత్ పంపిన సుమారు 80 డ్రోన్లలో ఒకటి నేరుగా తమ రక్షణ వ్యవస్థను ఛేదించిందని ఆయన పేర్కొన్నారు. దీనితో ఇప్పటివరకు పాక్ చెబుతున్న అబద్ధాలు ప్రపంచం ముందు బహిర్గతమయ్యాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఈ ఆపరేషన్ ప్రారంభించింది. కేవలం నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ మాత్రమే కాకుండా, ఉపగ్రహ చిత్రాల ప్రకారం మరో మూడు ప్రధాన విమానశ్రయాలు కూడా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ క్షిపణి దాడుల గురించి ప్రస్తావించగా, ఇప్పుడు విదేశాంగ మంత్రి ఏకంగా డ్రోన్ దాడుల విధ్వంసాన్ని ధృవీకరించడం గమనార్హం. ఈ పరిణామం భారత సైనిక వ్యూహచతురతను మరోసారి చాటిచెప్పింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *