అర్ధరాత్రి దొంగ అని చితకబాదారు తెల్లారేసరికి అదే ఇంటికి అల్లుడయ్యాడు
February 4, 2026

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వికాస్ అనే యువకుడు అర్ధరాత్రి తన ప్రియురాలిని కలిసేందుకు రహస్యంగా ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే అతడిని చూసిన కుటుంబ సభ్యులు దొంగ అని భావించి పట్టుకుని దర్మపడకలు ఇచ్చారు. ప్రాణభయంతో తను దొంగను కాదని, అదే ఇంట్లోని రూబీ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని వికాస్ అసలు విషయం బయటపెట్టాడు.
యువతి కూడా తమ ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోవడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిపి తెల్లారేసరికి ప్రియురాలితో వికాస్ వివాహం జరిపించారు. రాత్రి వరకు దొంగ అని దెబ్బలు తిన్న యువకుడు, మరుసటి రోజు ఉదయానికే అదే ఇంటికి అల్లుడిగా మారడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.