అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు!

తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న చర్యకు ప్రతికారంగా, అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. సీజ్ ఫైర్ అమల్లో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరగడం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం దౌత్యపరమైన ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.
చమురు ధరల పెరుగుదల
ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పై తీవ్రంగా పడింది. సరఫరాలో ఆటంకాలు ఏర్పడవచ్చన్న ఆందోళనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 96 డాలర్లకు చేరడంతో ప్రపంచ దేశాలు ఆర్థిక ఆందోళనలో మునిగిపోయాయి.
ఒక్క సారిగా
తమ నౌక సీజ్ చేసినందుకు అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్.
కాల్పుల విరమణ మరియు చర్చల మధ్యలో జరిగిన ఈ దాడితో అనిశ్చితి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 96 డాలర్లకు చేరిక.
ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలపై భారంగా మారనుంది.