బొద్దింకను చంపబోయి అపార్ట్‌మెంట్‌లో చిచ్చు పొరుగున ఉన్న మహిళ దుర్మరణం

బొద్దింకను చంపబోయి అపార్ట్‌మెంట్‌లో చిచ్చు పొరుగున ఉన్న మహిళ దుర్మరణం

దక్షిణ కొరియాలోని ఓసన్ నగరంలో ఒక మహిళ చేసిన చిన్న పొరపాటు ఘోర ప్రమాదానికి దారితీసింది. ఇంట్లో ఉన్న బొద్దింకను చంపడానికి లైటర్ మరియు స్ప్రే కలిపి నిప్పు రాజేయడంతో అపార్ట్‌మెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఐదవ అంతస్తులో నివసిస్తున్న 30 ఏళ్ల చైనా మహిళ మృతి చెందింది. మంటల నుండి తన రెండు నెలల పసికందును రక్షించుకోవడానికి కిటికీలోంచి కిందకు విసిరిన ఆ తల్లి, తాను మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూసింది.

ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైన మహిళపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రమాదకరమైన చిట్కాలను పాటించడం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పసిబిడ్డ ప్రాణాలు నిలిచినా, తల్లి మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *