₹3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కరిపించి చంపిన కొడుకులు!

₹3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కరిపించి చంపిన కొడుకులు!

తమిళనాడులోని పొదటూరుపేటలో ₹3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఇద్దరు కొడుకులు తమ తండ్రిని పాముతో కరిపించి చంపారు. మొదట నాగుపాముతో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో, రెండోసారి కట్లపామును తెచ్చి నిద్రిస్తున్న తండ్రిని కరిపించి మరణం సంభవించేలా చేశారు.

బీమా కంపెనీ అనుమానంతో పోలీసులు జరిపిన విచారణలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులతో పాటు పాములను సరఫరా చేసిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన ఈ కిరాతక పథకాన్ని చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *