WhatsApp లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ కలకలం! పాస్వర్డ్ లేకుండానే మీ అకౌంట్ హ్యాక్; జాగ్రత్త పడండిలా!
December 22, 2025

వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఘోస్ట్ పెయిరింగ్’ అనే కొత్త సైబర్ దాడి జరుగుతోందని భారత సైబర్ భద్రతా సంస్థ (CERT-In) హెచ్చరించింది. హ్యాకర్లు ఎటువంటి పాస్వర్డ్ లేదా సిమ్ కార్డ్ అవసరం లేకుండానే మీ అకౌంట్‌ను హైజాక్ చేస్తున్నారు. డివైజ్ లింకింగ్ ఫీచర్‌లోని లోపాలను వాడుకుని ఈ మోసానికి పాల్పడుతున్నారు.
ముఖ్యంగా అనుమానాస్పద లింకుల ద్వారా ఫోన్ నంబర్లు సేకరించి, మీ అకౌంట్‌ను హ్యాకర్ల పరికరాలకు లింక్ చేస్తున్నారు. రక్షణ కోసం తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు. మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘లింక్డ్ డివైజెస్’ (Linked Devices) ను తరచుగా తనిఖీ చేస్తూ, తెలియని పరికరాలు కనిపిస్తే వెంటనే లాగ్ అవుట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు