బంగారు నది మన దేశంలోనూ ఉంది! ఉచితంగా గోల్డ్ దొరికే చోటుకు బస్తాలతో పరుగులు

బంగారు నది మన దేశంలోనూ ఉంది! ఉచితంగా గోల్డ్ దొరికే చోటుకు బస్తాలతో పరుగులు

భారతదేశంలో ఒక ప్రత్యేకమైన నది ఉంది, అక్కడ తరతరాలుగా స్థానికులు బంగారం వెతుక్కుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రత్నగర్భ ప్రాంతంలో ఉన్న ‘సువర్ణరేఖ’ నది, దాని ఉపనది కర్కరిలో ఇప్పటికీ బంగారు రేణువులు లభిస్తాయని చెబుతారు. ఈ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. కర్కరి నది నుండి బంగారు రేణువులు కొట్టుకువచ్చి సువర్ణరేఖ నదిలో చేరుతాయని స్థానికులు నమ్ముతారు.

ఉపాధి కోసం మరెక్కడా వెళ్ళకుండా, చాలా మంది పేద స్థానికులు ప్రతిరోజూ ఉదయం సంచులతో ఇక్కడికి వచ్చి నదిలో బంగారం కోసం వెతుకుతారు. తరతరాలకు సరిపడా సంపద పోగేసేంత బంగారం దొరకనప్పటికీ, ప్రతిరోజూ కొన్ని గ్రాముల బంగారం సేకరించి తమ కనీస జీవన వ్యయాలను సమకూర్చుకుంటారు. ఆర్థికంగా కష్టకాలంలో కూడా, ఈ కొద్దిపాటి బంగారం స్థానికులకు జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరుగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *