జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై బిగ్ అప్‌డేట్! ముంబై శివాజీ పార్క్‌లో జైలు భరో ఆందోళనకు పిలుపు
October 1, 2026

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం నుంచి ముంబైలోని శివాజీ పార్క్‌లో శాసనోల్లంఘన, ‘జైలు భరో’ ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ అధినేతు అభిజిత్ దీప్కే బుధవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ మద్దతుదారులందరూ ముంబై చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీడియోలో చేతిలో క్రికెట్ బాల్‌ను తిప్పుతూ ఆయన సందేశాన్ని ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి విసిరిన సవాల్‌గా రాజకీయా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆందోళన కార్యక్రమాన్ని పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తామని అభిజిత్ హామీ ఇచ్చారు.