పెళ్లయిన సంగతే మర్చిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ పన్ను

పెళ్లయిన సంగతే మర్చిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ పన్ను

నటి తాప్సీ పన్ను మరియు మథియాస్ బో 13 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ తర్వాత 2024లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న తాప్సీ, పెళ్లయిన తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదని తెలిపారు. భర్త మథియాస్ తనను ఎప్పుడూ ఒత్తిడికి గురిచేయలేదని, అందుకే ఈ బంధం తనకు ఎంతో హాయిగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

తాను వివాహం చేసుకున్నాననే విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటానని తాప్సీ సరదాగా వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా పెళ్లి చేసుకున్న ఈ జంట, పరస్పర గౌరవం మరియు అవగాహనతో ముందుకెళ్తున్నారు. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *