జాతకం కలవలేదని పెళ్లి నిరాకరించడం ఇకపై శిక్షార్హమైన నేరం అని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
February 23, 2026

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత, జాతకాలు కలవలేదనే సాకుతో పెళ్లికి నిరాకరించడం నేరమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎనిమిదేళ్ల బంధం తర్వాత ఇలాంటి కారణాలు చెప్పడం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం మోసపూరితమైన చర్యగా కోర్టు పరిగణించింది.
నిందితుడు పెళ్లి పేరుతో నమ్మించి సంబంధం కొనసాగించాడని పేర్కొంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. కుటుంబం జాతకాలను కచ్చితంగా చూస్తుందని తెలిసి కూడా తప్పుడు వాగ్దానాలు చేయడం మోసమేనని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ప్రవర్తన చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించింది.