అమెరికా సైనిక దాడిలో డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతితో మెక్సికోలో చెలరేగిన హింస
February 23, 2026

మెక్సికోకు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి నెమేసియో రూబెన్ అలియాస్ ఎల్ మెంచో అమెరికా సైనిక దాడుల్లో మరణించారు. మాజీ పోలీస్ అధికారి అయిన మెంచోపై డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలు మరియు కిడ్నాపుల వంటి అనేక తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఆదివారం జరిగిన ఈ మెరుపు దాడిలో మెంచో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా నిఘా వర్గాలు ధృవీకరించాయి.
మెంచో మరణవార్తతో మెక్సికోలోని పలు ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఆయన అనుచరులు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టి భారీస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ తర్వాత అమెరికా చేపట్టిన ఈ తాజా ఆపరేషన్ ఇప్పుడు మెక్సికో ప్రభుత్వానికి శాంతిభద్రతల విషయంలో పెద్ద సవాలుగా మారింది.