మైనస్ డిగ్రీల చలిలో ప్రియురాలిని కొండపైనే వదిలేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

మైనస్ డిగ్రీల చలిలో ప్రియురాలిని కొండపైనే వదిలేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

పర్వతారోహణలో అత్యంత అనుభవజ్ఞుడైన ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పు, అతని ప్రియురాలి ప్రాణాలను బలిగొంది. మైనస్ డిగ్రీల గడ్డకట్టే చలిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రియురాలిని కొండపైనే వదిలేసి వచ్చిన థామస్ అనే వ్యక్తిపై ఇప్పుడు ఆస్ట్రియాలో విచారణ మొదలైంది. ఇది కేవలం ప్రమాదం కాదు, పక్కాగా నిర్లక్ష్యంతో కూడిన హత్య అని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు.

అసలేం జరిగింది? 2025 జనవరి 19న కెరిస్టిన్ జీ అనే 33 ఏళ్ల మహిళ తన బాయ్‌ఫ్రెండ్ థామస్‌తో కలిసి ఆస్ట్రియాలోని 3,798 మీటర్ల ఎత్తయిన గ్రాస్‌గ్లాక్‌నర్ పర్వతాన్ని ఎక్కేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. గంటకు 74 కి.మీ వేగంతో వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

నిందితుడు చేసిన 9 తప్పులు: ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, ఈ యాత్రలో థామస్ తొమ్మిది ప్రధాన తప్పిదాలు చేశారు:

  • వాతావరణం అనుకూలించకపోయినా మొండిగా ముందుకు వెళ్లడం.
  • పర్వతారోహణకు సరిపడని ‘స్నోబోర్డ్ సాఫ్ట్ బూట్లు’ ధరించడానికి కెరిస్టిన్‌ను అనుమతించడం.
  • అత్యవసర రక్షణ పరికరాలను వెంట తీసుకెళ్లకపోవడం.
  • రాత్రి వేళ హెలికాప్టర్లు తిరుగుతున్నా డిస్ట్రెస్ సిగ్నల్స్ ఇవ్వకపోవడం.
  • చివరి నిమిషంలో గర్ల్‌ఫ్రెండ్‌ను ఒంటరిగా వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తాను కిందకు దిగి రావడం.

కోర్టులో వాదనలు: థామస్ తరపు న్యాయవాది దీన్ని ఒక ‘విషాదకర ప్రమాదం’గా అభివర్ణించారు. ఇద్దరికీ అనుభవం ఉందని, శిఖరానికి కేవలం 130 అడుగుల దూరంలో ఉన్నప్పుడు కెరిస్టిన్ అలసిపోయిందని, సాయం కోసమే థామస్ కిందకు వచ్చారని వాదించారు. అయితే, వెబ్‌క్యామ్ ఫుటేజీలో థామస్ టార్చ్ లైట్ పట్టుకుని దిగిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

తీర్పు ఎందుకు కీలకం? ఈ కేసులో థామస్ దోషిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ తీర్పు భవిష్యత్తులో పర్వతారోహకులు తమ సహచరుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలనే విషయంలో ఒక మైలురాయిగా నిలవనుంది. కేవలం సాహసం కోసం వెళ్లేవారు ఎదుటివారి ప్రాణాలను పణంగా పెట్టకూడదని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *