ఇకపై ఏసీ 25 డిగ్రీల కంటే తగ్గించారో జరిగేది ఇదే
February 18, 2026

వేసవి ముందే మేల్కొన్న సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ మార్పులతో ఈ నెల 19 నుంచే ఉక్కపోత మొదలవుతుండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) 2018 మార్గదర్శకాల ప్రకారం.. ఏసీ ఉష్ణోగ్రతను 25 డిగ్రీల కంటే తక్కువగా సెట్ చేయడంపై నిషేధం విధించారు. ఇంధన పొదుపు లక్ష్యంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేశారు.