పాకిస్థాన్‌లో రణవీర్ సింగ్ నిషేధిత చిత్రం ధురంధర్ హవా కేవలం 16 రూపాయలకే విక్రయం

పాకిస్థాన్‌లో రణవీర్ సింగ్ నిషేధిత చిత్రం ధురంధర్ హవా కేవలం 16 రూపాయలకే విక్రయం

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ అక్కడి ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది. థియేటర్లలో ప్రదర్శన అనుమతి లేకపోవడంతో అభిమానులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించడానికి సిద్ధమవుతున్నారు.

కరాచీలోని బహిరంగ మార్కెట్లలో ఈ సినిమా పైరేటెడ్ సిడిలు యథేచ్ఛగా అమ్ముడవుతున్నాయి. కేవలం 50 పాకిస్థానీ రూపాయలు అంటే భారత కరెన్సీలో సుమారు 16 రూపాయలకే ఈ నిషేధిత చిత్రం అందుబాటులోకి రావడంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *