పాకిస్థాన్లో రణవీర్ సింగ్ నిషేధిత చిత్రం ధురంధర్ హవా కేవలం 16 రూపాయలకే విక్రయం
February 13, 2026

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రంపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ అక్కడి ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది. థియేటర్లలో ప్రదర్శన అనుమతి లేకపోవడంతో అభిమానులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించడానికి సిద్ధమవుతున్నారు.
కరాచీలోని బహిరంగ మార్కెట్లలో ఈ సినిమా పైరేటెడ్ సిడిలు యథేచ్ఛగా అమ్ముడవుతున్నాయి. కేవలం 50 పాకిస్థానీ రూపాయలు అంటే భారత కరెన్సీలో సుమారు 16 రూపాయలకే ఈ నిషేధిత చిత్రం అందుబాటులోకి రావడంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.