సంజూ శామ్సన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపిక
February 13, 2026

రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు పగ్గాలను సంజూ శామ్సన్ నుండి యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఫిబ్రవరి 13న ఈ విషయాన్ని వెల్లడించి క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
కెప్టెన్సీ రేసులో ఉన్న యశస్వి జైస్వాల్ మరియు రవీంద్ర జడేజాతో సహా ఆరుగురు దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి అస్సాం క్రికెటర్ ఈ బాధ్యతను దక్కించుకున్నాడు. జట్టులో తీసుకొచ్చిన ఈ పెను మార్పు రాబోయే టోర్నమెంట్‌లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.