బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ ప్రభంజనం ప్రధాని మోదీ అభినందనలతో ఇరు దేశాల మధ్య మారుతున్న సమీకరణాలు

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ ప్రభంజనం ప్రధాని మోదీ అభినందనలతో ఇరు దేశాల మధ్య మారుతున్న సమీకరణాలు

బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ 210కి పైగా స్థానాలను గెలుచుకుని ఘనవిజయం సాధించింది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ తారిఖ్ రెహ్మాన్‌కు అభినందనలు తెలిపారు. ఈ గెలుపు బంగ్లా ప్రజల నమ్మకానికి నిదర్శనమని, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మోదీ అభినందనల పట్ల బీఎన్పీ సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆ పార్టీ నేత నజ్రుల్ ఇస్లాం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి, పరస్పర గౌరవంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *