చెన్నైలో 1,500 కాకుల హఠాన్మరణం! బర్డ్ ఫ్లూ ముప్పు మనుషులకు పొంచి ఉందా?
February 6, 2026

చెన్నైలో వారం రోజుల్లోనే దాదాపు 1,500 కాకులు మృతి చెందడం కలకలం రేపుతోంది. పరీక్షల్లో వీటికి ప్రమాదకరమైన H5N1 బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ వైరస్ వేగంగా మార్పు చెందుతూ పక్షుల నుండి జంతువులకు, తద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 48 శాతంగా ఉంది. తీవ్రమైన జ్వరం, దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలు దీని ప్రధాన లక్షణాలు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.