అబూజ్‌మడ్‌ అడవుల్లో భారీ కాల్పుల కలకలం: ముగ్గురు మావోయిస్టుల హతం, ఒక జవాన్ మృతి

అబూజ్‌మడ్‌ అడవుల్లో భారీ కాల్పుల కలకలం: ముగ్గురు మావోయిస్టుల హతం, ఒక జవాన్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బలగాల సెర్చ్ ఆపరేషన్ సమయంలో రాత్రంతా జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు వీరమరణం పొందారు. మార్చి 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లక్ష్యంలో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *