యోగి సీరియస్! ‘ఘుష్ ఖోర్ పండిట్’ వివాదంపై స్పందించిన మనోజ్ బాజ్‌పాయీ

యోగి సీరియస్! ‘ఘుష్ ఖోర్ పండిట్’ వివాదంపై స్పందించిన మనోజ్ బాజ్‌పాయీ

నెట్‌ఫ్లిక్స్ సినిమా ‘ఘుష్ ఖోర్ పండిట్’ టైటిల్ పై ఉత్తరప్రదేశ్ లో వివాదం రాజుకుంది. బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందన్న ఫిర్యాదుతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు మనోజ్ బాజ్‌పాయీ, దర్శకుడు నీరజ్ పాండే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వివాదంపై మనోజ్ బాజ్‌పాయీ స్పందిస్తూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని తెలిపారు. ప్రజల అభ్యంతరాల మేరకు సోషల్ మీడియా నుండి ప్రచార చిత్రాలను తొలగించామన్నారు. ఇది కేవలం ఒక కల్పిత పాత్రకు సంబంధించిన కథ మాత్రమేనని, సామాజిక సామరస్యాన్ని తాము గౌరవిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *