బీహార్ ఎన్నికల రద్దు? ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ షాక్!

బీహార్ ఎన్నికల రద్దు? ప్రశాంత్ కిషోర్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ షాక్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సూరాజ్ పార్టీ’ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రజల తీర్పును న్యాయ వ్యవస్థ ద్వారా మార్చలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత ఇలాంటి విన్నపాలు చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. అయితే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పుతో బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల పారదర్శకతపై విపక్షాలు లేవనెత్తిన వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *