ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణం తీస్తున్నాయా, గాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యతో కలకలం

ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణం తీస్తున్నాయా, గాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యతో కలకలం

న్యూస్ డెస్క్ : ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ముగ్గురు మైనర్ బాలికలు 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాజియాబాద్‌లో జరిగిన ఈ విషాదం నేటి తరం పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనాన్ని కళ్ళకు కడుతోంది. 16, 14 మరియు 12 ఏళ్ల వయసున్న ఈ బాలికలు ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకోవడం తల్లిదండ్రులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

వీరు ‘కొరియన్ లవర్’ అనే టాస్క్-బేస్డ్ గేమ్‌కు బానిసలైనట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు ‘మమ్మీ-పాపా సారీ’ అని రాసిన సూసైడ్ నోట్ దొరికింది. కరోనా తర్వాత చదువు మానేసి రోజంతా మొబైల్ ఫోన్లకే పరిమితం కావడం వీరి మానసిక స్థితిని దెబ్బతీసింది. మీ పిల్లలు కూడా ఇంటర్నెట్ మాయలో పడిపోతున్నారా? ఈ ఘటన ప్రతి ఇంటికీ ఒక హెచ్చరిక, పిల్లల డిజిటల్ అలవాట్లపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *