మరిదితో మోహం, భర్తను అడ్డుతప్పించేందుకు భార్య వేసిన ఘోరమైన ప్లాన్
February 4, 2026

న్యూస్ డెస్క్ : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో ఎంతటి చిచ్చు పెడతాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక భార్య తన మరిదితో కలిసి భర్తను చంపడానికి కుట్ర పన్నింది. నమ్మకమైన బంధాలే ప్రాణాలు తీసే స్థాయికి చేరుతుండటం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యే ఇటువంటి దారుణాలు జరగడం సామాజిక భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పోలీసుల విచారణలో లలిత అనే మహిళ తన వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త రిషి కుమార్‌ను తుపాకీతో కాల్చి చంపించినట్లు తేలింది. మొదట మొబైల్ దొంగతనం నెపంతో వేరొకరిపై నిందలు వేసినా, చివరకు నిజాన్ని పోలీసులు రాబట్టారు. స్వార్థం కోసం కట్టుకున్న వాడిని కాలయముడికి అప్పగించిన ఈ ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.