ఎనిమిది మంది భర్తలకు ప్రాణాంతక వ్యాధిని అంటించిన కిలేడీ పెళ్లికూతురు, పెళ్లి విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారా

ఎనిమిది మంది భర్తలకు ప్రాణాంతక వ్యాధిని అంటించిన కిలేడీ పెళ్లికూతురు, పెళ్లి విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నారా

న్యూస్ డెస్క్ : పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు దోచుకోవడం ఒక ఎత్తు అయితే, ఏకంగా ప్రాణాల మీదకు తీసుకురావడం మరో ఎత్తు. ఎనిమిది మందిని పెళ్లాడి నిలువునా ముంచేసిన ఒక కిలేడీ పెళ్లికూతురు, ఇప్పుడు వారికి హెచ్ఐవీ అనే తీరని వ్యాధిని కూడా అంటించింది. ఆ ఎనిమిది మంది భర్తలు ఇప్పుడు ప్రాణ భయంతో వణికిపోతున్నారు, ఇది వింటున్న సామాన్య ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

పాటియాలాకు చెందిన ఈ మహిళ తన అసలు భర్తనే అన్నగా పరిచయం చేస్తూ ఈ మోసాలకు పాల్పడేది. పెళ్లయిన కొద్దిరోజులకే నగలు, డబ్బుతో పరారవ్వడం ఈ ముఠా పని. తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కిన ఈమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ తిన్నారు. తెలియని వ్యక్తులను పెళ్లి చేసుకునే ముందు వారి నేపథ్యం మరియు ఆరోగ్యం గురించి తెలుసుకోకపోతే ఎంతటి ప్రమాదమో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *