తండ్రే భర్తగా మారే వింత ఆచారం, బంగ్లాదేశ్ తెగలో కొనసాగుతున్న అమానుషం

న్యూస్ డెస్క్ : తండ్రి కూతుళ్ల బంధం అత్యంత పవిత్రమైనది, కానీ బంగ్లాదేశ్‌లోని మండి తెగలో ఈ బంధానికి అర్థమే లేకుండా పోతోంది. సామాజిక భద్రత పేరుతో ఇక్కడ కూతుళ్లు తమ తండ్రినే (సొంత తండ్రి కాని వ్యక్తిని) వివాహం చేసుకోవాల్సి వస్తోంది. ఈ వింత ఆచారం వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. నాగరిక సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా కొనసాగడం అమానుషం. ఇది ఆడపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా, వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ తెగ నియమం ప్రకారం, ఒక విధవరాలు రెండో వివాహం చేసుకుంటే, ఆ వ్యక్తి ఆమె కూతురికి కూడా భర్త అవుతాడు. ఒరెలా అనే మహిళ తన మూడు ఏళ్ల వయసులోనే తండ్రికి భార్యగా మారిన చేదు నిజాన్ని బయటపెట్టింది. ఇలాంటి దురాచారాలు సంప్రదాయం పేరుతో కొనసాగడం నాగరికతకే మచ్చ. మనిషి ప్రాథమిక హక్కులను కాలరాసే ఇటువంటి పద్ధతులు మారాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. ఈ అమానుషం పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.