సవతి తల్లితో పారిపోయిన కొడుకు నివ్వెరపోయేలా చేసిన వింత ఉదంతం
February 1, 2026

హర్యానాలోని నూహ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన మొదటి భార్య కొడుకు తన రెండో భార్యతో (సవతి తల్లి) ప్రేమలో పడి ఇంటి నుండి పారిపోయాడు. బాధితుడు రామకృష్ణ తన రెండో భార్యతో 15 ఏళ్లుగా కాపురం చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే అతని మొదటి భార్య కొడుకు తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలోనే సవతి తల్లితో ప్రేమాయణం సాగించి ఇద్దరూ కలిసి పారిపోయారు.
రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న 30 వేల రూపాయల నగదు మరియు బంగారు నగలను తీసుకుని వారు పరారయ్యారు. అనంతరం వారు కోర్టులో పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం. తన సొంత కొడుకే ఇలాంటి పని చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తండ్రి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.