ఏ పాఠశాల నేర్పని జీవిత సత్యాలను చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బామ్మ

ఏ పాఠశాల నేర్పని జీవిత సత్యాలను చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బామ్మ

సోషల్ మీడియాలో ప్రస్తుతం సత్వంతి సింగ్ అనే వృద్ధురాలి వీడియో తెగ వైరల్ అవుతోంది. జీవితంలో మోసపోకుండా, పశ్చాత్తాపం చెందకుండా ఉండటానికి పాటించాల్సిన నాలుగు ముఖ్యమైన సూత్రాలను ఆమె వివరించారు. పుస్తకాల్లో దొరకని ఈ అనుభవ పాఠాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, ముఖ్యంగా ఆమె చెప్పిన విధానం అందరినీ ఆలోచింపజేస్తోంది.

తాను మోసపోకుండా ఉండటానికి కొంత తెలివితేటలు అవసరమని, అందరినీ గుడ్డిగా నమ్మకూడదని ఆమె సూచించారు. బయట కనిపించే అందానికి, తీపి మాటలకు లోబడకూడదని, సొంత విషయాలను అందరితో పంచుకోకూడదని ఆమె తెలిపారు. నిజాన్ని కూడా సందర్భోచితంగా చెప్పాలని ఆమె ఇచ్చిన సలహాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

View this post on Instagram

A post shared by @satvantisingh

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *