రైలు సీటు కోసం జుట్టు పట్టి లాక్కున్న మహిళలు వైరల్ అవుతున్న వీడియో

రైలు సీటు కోసం జుట్టు పట్టి లాక్కున్న మహిళలు వైరల్ అవుతున్న వీడియో

రైలు ప్రయాణంలో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. సాధారణ మాటలతో మొదలైన ఈ గొడవ కాసేపటికే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. వైరల్ అవుతున్న వీడియోలో మహిళలు పరస్పరం జుట్టు పట్టుకుని లాక్కుంటూ తీవ్రంగా గొడవ పడటం కనిపిస్తుంది. ఈ ఘటనతో రైలులోని తోటి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

గొడవ ముదరడంతో అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడదీయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఎక్స్‌ వేదికగా ఈ వీడియో వైరల్ అవుతుండగా, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీటు కోసం ఇంతలా తెగబడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *