మీరు వంటల్లో వాడే ఇంగువ ఎలా తయారవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
February 4, 2026

భారతీయ వంటకాల్లో ప్రత్యేక రుచినిచ్చే ఇంగువ, ఫెరులా మొక్క వేర్ల నుండి వచ్చే జిగురు లాంటి పదార్థం ద్వారా తయారవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రాంతంలో ఈ వేర్లను సేకరించి, ఎండలో ఎండబెట్టి ఇంగువను ఎలా తయారు చేస్తారో స్పష్టంగా చూపించారు.
అయితే మార్కెట్లో లభించే ఇంగువలో ఎక్కువ భాగం కల్తీ అని తెలుస్తోంది. స్వచ్ఛమైన ఇంగువ ధర ఎక్కువగా ఉండటంతో, సాధారణంగా విక్రయించే పొడిలో కేవలం 5 నుండి 10 శాతం మాత్రమే అసలైన ఇంగువ ఉంటుంది. మిగిలిన భాగంలో గోధుమ పిండి మరియు తినదగిన గమ్ కలుపుతారు. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.