మైక్రోవేవ్ ఓవెన్ పైన వస్తువులు పెడుతున్నారా, మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
February 4, 2026

న్యూస్ డెస్క్ : వంటగదిలో స్థలం తక్కువగా ఉందని చాలామంది మైక్రోవేవ్ ఓవెన్ పైన డబ్బాలు లేదా ఇతర వస్తువులను సర్దుతుంటారు. ఈ చిన్న అలవాటు మీ ప్రాణాలకే ప్రమాదకరంగా మారవచ్చు. ఓవెన్ పని చేసేటప్పుడు లోపల ఉత్పన్నమయ్యే వేడి గాలి బయటకు వెళ్లే దారి మూసుకుపోతే, అది వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది. ఈ నిర్లక్ష్యం భారీ అగ్నిప్రమాదానికి దారితీయవచ్చు.
ఓవెన్ పైన ఉండే ప్లాస్టిక్ వస్తువులు కరిగిపోవడం లేదా కాగితం వంటి వస్తువులు మంటలు అంటుకోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఓవెన్ పైన నేరుగా వస్తువులు పెట్టకుండా ఉండటమే శ్రేయస్కరం. మైక్రోవేవ్ సురక్షితంగా ఉండాలంటే దాని చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలి. వస్తువుల కోసం ప్రత్యేకంగా స్టాండ్ లేదా షెల్ఫ్ వాడటం వల్ల ప్రమాదాలను నివారించి మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.