చెన్నై బాస్తా మోతాలా హత్య కేసులో సంచలన మలుపు వెలుగులోకి వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక

చెన్నై బాస్తా మోతాలా హత్య కేసులో సంచలన మలుపు వెలుగులోకి వచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక

చెన్నైలో నివసిస్తున్న బీహార్ దంపతులు మరియు వారి రెండేళ్ల చిన్నారి హత్య కేసులో పోస్ట్‌మార్టం నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. తొలుత ఈ హత్యలు అత్యాచార యత్నం కారణంగా జరిగాయని భావించినప్పటికీ, మహిళపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని వైద్యులు స్పష్టం చేశారు. నిందితులు ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు నివేదిక పేర్కొంది.

హత్య అనంతరం నిందితులు మృతదేహాలను వేర్వేరు సంచుల్లో కట్టి అడయార్ మరియు బకింగ్‌హామ్ కెనాల్ వంటి ప్రాంతాల్లో పడేశారు. పోలీసులు గాలింపు చేపట్టి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పసిగుడ్డు అని కూడా చూడకుండా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *