నేటి నుండి సిగరెట్ ధరలు భారీగా పెంపు సామాన్యుడికి చుక్కలు
February 1, 2026

దేశవ్యాప్తంగా నేటి నుంచి (ఫిబ్రవరి 1) సిగరెట్ల ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జిఎస్టిని 28% నుండి 40%కి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని అమలులోకి తెచ్చింది. దీని ఫలితంగా సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్ పై ₹2.05 నుండి ₹8.50 వరకు అదనపు భారం పడనుంది. సెస్‌కు బదులుగా కొత్త ఎక్సైజ్ సుంకం అమలులోకి రావడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
పన్నుల పెంపుతో పాటు పాన్ మసాలా, గుట్కా తయారీదారులపై ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది. ఇకపై తయారీదారులు ప్యాకింగ్ మిషన్ల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి రెండేళ్ల వరకు రికార్డింగ్‌ను భద్రపరచాల్సి ఉంటుంది. నమిలే పొగాకు, జర్దాపై ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా 82% మరియు 91%కి పెంచడం వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశీయ సిగరెట్ ఉత్పత్తి 6-8% తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.