ఢిల్లీ పయనమైన మమతా బెనర్జీ, ఎన్నికల కమిషన్‌తో కీలక భేటీపై ఉత్కంఠ
February 1, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ఆదివారం ఢిల్లీకి పయనం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఆమె కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై తృణమూల్ కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న తీవ్ర అభ్యంతరాలే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ ఇప్పటికే కమిషన్‌కు ఆరు లేఖలు రాశారు. సోమవారం స్వయంగా వెళ్లి ఈ అంశంపై ఆమె నిరసన తెలపనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.