మూత్రవిసర్జనలో ఈ మార్పులను అశ్రద్ధ చేయకండి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది

మూత్రవిసర్జనలో ఈ మార్పులను అశ్రద్ధ చేయకండి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది

మానవ శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు వీటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. మూత్రపిండాల వ్యాధి ప్రాథమిక లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల చాలామంది వాటిని గుర్తించలేరని వైద్యులు చెబుతున్నారు. అయితే మూత్రవిసర్జనలో వచ్చే మార్పులే ఈ వ్యాధికి ప్రధాన సంకేతాలు. మూత్రంలో రక్తం పడటం, నురుగు రావడం లేదా రాత్రి వేళల్లో పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.

రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు మూత్రవిసర్జన చేయడం సాధారణమని అంతకంటే తక్కువ లేదా ఎక్కువ సార్లు వెళ్లడం సమస్యకు చిహ్నమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాల వాపు, తీవ్రమైన అలసట మరియు మూత్రంలో రాళ్ల పొడి రావడం వంటివి కనిపిస్తే వెంటనే యూరాలజిస్టును సంప్రదించాలి. వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా కిడ్నీ వైఫల్యం వంటి ప్రమాదకర పరిస్థితుల నుండి సురక్షితంగా బయటపడవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *