పెళ్లికి సరిగ్గా రెండు వారాల ముందు ప్రియురాలితో జంప్ అయిన వధువు

పెళ్లికి సరిగ్గా రెండు వారాల ముందు ప్రియురాలితో జంప్ అయిన వధువు

పంజాబ్‌లోని తరన్ తారణ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. జనవరి 14న పెళ్లి జరగాల్సిన వధువు లఖ్వీందర్ కౌర్, తన ప్రియురాలితో కలిసి కనిపించకుండా పోయింది. పెళ్లికి కేవలం 14 రోజుల సమయం ఉండగా, తన స్నేహితురాలు సునీత అలియాస్ రాటాతో కలిసి ఆమె పారిపోయింది. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, ఈ పెళ్లి జరగనివ్వనని సునీత గతంలోనే హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డిసెంబర్ 24 నుంచి ఇద్దరు యువతులు కనిపించకపోవడంతో వధువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పు చేసి పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇద్దరు యువతులు మేజర్లు అయినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సామాజిక గౌరవం, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *