ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు గోల్డ్ లోన్లలో 125 శాతం భారీ పెరుగుదల

ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు గోల్డ్ లోన్లలో 125 శాతం భారీ పెరుగుదల

గత ఏడాది కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో గోల్డ్ లోన్లకు డిమాండ్ భారీగా పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం, నవంబర్ 2025 నాటికి గోల్డ్ లోన్లు గత ఏడాదితో పోలిస్తే 125 శాతం వృద్ధితో రూ.3.5 లక్షల కోట్లకు చేరాయి. పసిడి ధర పెరగడం వల్ల కుదవపెట్టిన బంగారం విలువ (Collateral value) పెరిగి, ఖాతాదారులకు ఎక్కువ రుణం పొందే అవకాశం కలిగింది. ఈ క్రమంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ మార్కెట్ వాటాను దక్కించుకోవడం విశేషం.

వాహన మరియు గృహ రుణాల విభాగంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో వాహన రుణాలు 11 శాతం పెరగగా, గృహ రుణాలు రూ.31.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పండుగ సీజన్ తర్వాత పర్సనల్ లోన్ల వినియోగం కొంత తగ్గింది. మరోవైపు, అమెరికా సుంకాల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ రుణ చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించింది. దీనివల్ల వాణిజ్య రంగానికి ఇచ్చే రుణాలు 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *