మృత్యువు అంచుల్లోంచి బయటపడ్డ గాడిద ఆత్మవిశ్వాసంతో సాధించిన అద్భుతం
January 2, 2026

ఒక గ్రామంలో ముసలి గాడిద ఒకటి ఎండిపోయిన బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీయడం కష్టమని భావించిన యజమాని, బావిని మట్టితో పూడ్చి అక్కడే సమాధి చేయాలని నిర్ణయించుకున్నాడు. పైనుంచి మట్టి పడుతుంటే గాడిద మొదట భయపడినా, చనిపోవడానికి సిద్ధంగా లేక పోరాటం మొదలుపెట్టింది.
తమ మీద పడే మట్టిని విదిలిస్తూ, ఆ మట్టి కుప్పపైనే అడుగు వేస్తూ పైకి రావడం ప్రారంభించింది. అలా మట్టి పెరుగుతున్న కొద్దీ గాడిద పైకి చేరుకుని, చివరకు బావి నుంచి సురక్షితంగా బయటపడింది. ఏ సమస్యకైనా కుంగిపోకుండా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందని ఈ ఘటన నిరూపిస్తుంది.