కళ్లలో కారం కొట్టి రైతు వద్ద ఉన్న 25 లక్షల రూపాయలు దోచుకెళ్లిన దుండగులు

కళ్లలో కారం కొట్టి రైతు వద్ద ఉన్న 25 లక్షల రూపాయలు దోచుకెళ్లిన దుండగులు

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. ఒక రైతు తన ద్విచక్ర వాహనంపై 25 లక్షల రూపాయల నగదుతో వెళ్తుండగా ముగ్గురు దుండగులు అడ్డగించారు. మాటకలిపినట్లు నటించి అకస్మాత్తుగా లఖ్వీందర్ అనే ఆ రైతు కళ్లలో కారం కొట్టారు. ఆయన నొప్పితో విలవిలలాడుతుండగా, నిందితులు నగదు సంచులతో పరారయ్యారు. ప్రస్తుతం బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారం కలిపిన నీటిని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే నెలలో మరో వ్యాపారి వద్ద కూడా ఇదే తరహాలో 20 లక్షల రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దోపిడీలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *